‘మృత్యుంజయ్’లో ఐపీఎస్ సీతా పరశురామ్‌గా..

‘మృత్యుంజయ్’లో ఐపీఎస్ సీతా పరశురామ్‌గా..
X

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రమ్య గున్నం సమర్పణలో లైట్‌బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ ‘సామజవరగమన’ మూవీ తర్వాత శ్రీవిష్ణు, రేబా మోనికా జాన్ జంటగా నటిస్తున్నారు. మేకర్స్ ఈ సినిమాలో రేబా మోనికా జాన్ పోషిస్తోన్న ఐపీఎస్ సీతా పరుశురామ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇది సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా కనిపిస్తోంది. అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను దోచుకున్న ముద్దుగుమ్మ రేబా జాన్ మృత్యుంజయ్ చిత్రంలో మరో ఆసక్తికరమైన పాత్రలో కనిపించనుంది. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో ఆమె తనదైన నటనతో ఎలాంటి థ్రిల్స్ ఇవ్వనుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు.

Tags

Next Story