కొత్తగూడెంలో కార్పొరేషన్‌‌లో సిపిఐ, కాంగ్రెస్ మధ్య టై

Congress, CPI
X

భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణలో ఈ నెల 11న జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటివరకూ వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యంతో దూసుకుపోతుంది. ప్రతిపక్ష పార్టీలు బిఆర్ఎస్, బిజెపిలు కాంగ్రెస్ కంటే చాలా వెనుకంజలో ఉన్నాయి. అయితే భద్రాద్రి కొత్తగూడెం కార్పొరేషన్ ఫలితాల్లో కాంగ్రెస్, సిపిఐ మధ్య టై అయింది. మున్సిపల్ కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉండగా.. సిపిఐ, కాంగ్రెస్‌ చెరి 22 డివిజన్లలో విజయం సాధించాయి. ఇక బిఆర్ఎస్ 08, సిపిఎం 01, బిజెపి 01, ఇండిపెండెంట్‌లు 6లో గెలిచాయి.

Tags

Next Story