రాయదుర్గం కొండల్లో పులి సంచారం.. చిక్కుకున్న సందర్శకులు..

రాయదుర్గం కొండల్లో పులి సంచారం.. చిక్కుకున్న సందర్శకులు..
X

రాజమండ్రి: దేవీపట్నం మండలం రాయదుర్గం అడవుల్లో పులి సంచారం కలకలం రేపుతోంది. ఈ విషయం తెలియక రాజనగరం మండలానికి చెందిన సుమారు 50 మంది సందర్శకులు ఆ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లారు. విషయం తెలుస్తుకొని వారు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయంపై ఎంపి పురందేశ్వరి కార్యాలయ సిబ్బంది.. వెంటనే జిల్లా కలెక్టర్, డిఎఫ్‌వొకు సమాచారం అందించారు. దీంతో సందర్శకులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు అటవీశాఖ బృందాలు రంగంలోకి దిగాయి. గత ఐదు రోజులుగా దేవీపట్నం మండల గోదావరి తీరంలోనే పులి తిరుగుతోంది. దీనిపై ఎప్పటికప్పుడు అటవీ శాఖ అధికారులు సమాచారం అందిస్తున్నారు. అయితే, ఈ విషయం తెలుసుకోకుండా సందర్శకులు రాయదుర్గం కొండకు వెళ్లి చిక్కుకుపోయారు.

Tags

Next Story