తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

X
Huge Devotees to visit Tirumala Temple
తిరుపతి: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. గురువారం తెల్లవారుజాము నుంచి తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనానికి వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. తిరుమలకు భక్తులు పోటెత్తడంతో వెంకన్న దర్శనం కోసం కంపార్టుమెంట్ల వెలుపల క్యూలైన్ లో వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 24 గంటలు పడుతోంది.
ఇక, బుధవారం శ్రీవారిని 77,670 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో స్వామివారికి 33,904 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్నశ్రీవారిని హుండీ ఆదాయం రూ.3.95 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.
Next Story
-
Home
-
Menu
