తాటి చెట్టుపైనే గీత కార్మికుడు మృతి

X
తాటి చెట్టుపై కల్లు గీయడానికి ఎక్కిన గీత కార్మికుడు ప్రమాదవశాత్తు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. మద్దిరాల గ్రామానికి చెందిన చామకూరి వెంకన్న(56) ఉదయం కల్లు గీయడానికి వెళ్లి తాటి చెట్టుపై మృతి చెందాడు. కల్లు గీసి చెట్టు దిగుతుండగా మోకు జారి తల క్రిందులై ఊపిరాడక చెట్టుపైనే మృతి చెందాడు. స్థానికులు గమనించి కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో తాటి చెట్టుపై వేలాడుతున్న వెంకన్న మృత దేహాన్ని కిందికి దించి పోస్ట్ మార్టం నిమిత్తం తుంగతుర్తి ఆసుపత్రికి తరలించారు.
Next Story
-
Home
-
Menu
