మేడారం వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా: ఇద్దరు మృతి

మేడారం వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా: ఇద్దరు మృతి
X

మహాదేవపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మేడారం జాతరకు వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తాపడడంతో ఇద్దరు మృతి చెందారు. పలువురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. మృతులు తల్లీకూతుళ్లుగా గుర్తించారు. గాయపడిన వారిలో కూడా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండలం ముత్తంపేట గ్రామానికి చెందిన 25 మంది సమ్మక్క సారలమ్మ భక్తులు ట్రాక్టర్ లో మేడారం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.




Next Story