ఖమ్మం లో రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి!

ఖమ్మం లో రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి!
X

హైదరాబాద్: ఖమ్మం జిల్లా వైరా సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన భార్యాభర్తలు మృతి చెందారు. అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ విషాద ఘటన జరిగింది. ప్రమాదంలో మృతి చెందిన వారిని హైదరాబాద్‌కు చెందిన కిషోర్ రెడ్డి, లావణ్యగా పోలీసులు గుర్తించారు. స్వామివారి దర్శనం చేసుకుని ఆనందంగా ఇంటికి తిరిగి వస్తున్న దంపతులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, బంధువుల్లో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story