జాతీయ రహదారిపై ట్రావెల్ బస్సు బోల్తా.. నలుగురు మృతి

జాతీయ రహదారిపై ట్రావెల్ బస్సు బోల్తా.. నలుగురు మృతి
X

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి మండలం గన్నారం వద్ద 44వ జాతీయ రహదారిపై అర్థరాత్రి ట్రావెల్ బస్సు బోల్తా పడింది. నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి 22 మందితో అకోలా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story