శంషాబాద్‌లో హోటల్ లోకి దూసుకెళ్లిన బస్సు: ఒకరు మృతి

X
Road accident in Medchal district: Three killed
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. కంటైనర్‌ను బస్సు తప్పించబోయి హోటల్‌లోకి దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. పలువురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. హోటల్‌లో ఓ వ్యక్తి టీ తాగుతుండగా అతడిని ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రావెల్స్ బస్సు అతివేగంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. జిహెచ్ఎంసి పరిధిలోనికి వచ్చిన తరువాత బస్సులు స్పీడ్ తగ్గించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అతివేగంగా నడిపే వాహనాలపై చలాన్లు విధిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. వాహనాదారుల్లో మార్పు మాత్రం కనిపించడం లేదని పోలీసులు పేర్కొన్నారు.
Tags
Next Story
-
Home
-
Menu
