నిజామాబాద్‌లో ట్రావెల్స్ బస్సు బోల్తా: నలుగురు మృతి

X
ఇందల్వాయి: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో గన్నారం వద్ద జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడడంతో నలుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. 22 మంది ప్రయాణికులతో బస్సు హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అకోలాకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags
Next Story
-
Home
-
Menu
