అనంతగిరి కొండల్లో టీచర్ ప్రాణం తీసిన ట్రెక్కింగ్

అనంతగిరి కొండల్లో టీచర్ ప్రాణం తీసిన ట్రెక్కింగ్
X

వికారాబాద్: ఓ మహిళ ట్రెక్కింగ్‌కు వెళ్లి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లా అనంతగిరిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ ప్రాంతానికి చెందిన ప్రియాంక మోల్ అనే తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం అనంతగిరికి విహారయాత్రకు వెళ్లారు. నందిఘాట్ అటవీ ప్రాంతంలో పర్యటించిన అనంతరం ఆమె ట్రెక్కింగ్ చేశారు. వ్యూ పాయింట్ చేరుకున్న అనంతరం అనంతగిరి అటవీ ప్రాంతాన్ని వీక్షించి పరవశించిపోయారు. ఒక్కసారిగా ప్రియాంక కుప్పకూలిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. ఆమె గుండెపోటుతో చనిపోయిందని వైద్యులు వివరించారు. విహారయాత్ర విషాదంగా మారడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తుండడంతో విద్యార్థులు కన్నీంటిపర్యంతమయ్యారు. ఎక్కువగా వ్యాయమం చేయని వారు ట్రెక్కింగ్ చేస్తే త్వరగా అలసి పోవడంతో హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశం ఉంటుంది. గుండె జబ్బులు, బిసి, షుగర్ వ్యాధులు ఉన్నవారు ట్రెక్కింగ్ చేయకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Tags

Next Story