అటవీ శాఖ అధికారులపై గిరిజనుల దాడి

Tribals attack On forest department officials
అటవీ భూమిని అక్రమంగా నరుకుతుంటే అడ్డుకోబోయిన అటవీ సిబ్బంది పై గిరిజనులు దాడి చేసిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామ సమీపంలోని వత్తిమక్కులకుంట దగ్గర దాదాపు 15 ఎకరాల అటవీ భూమిలో కొంత మంది గిరిజనులు చెట్లను నరికారు. అటవీ భూమి నరకుతుంటే అడ్డుకోబోయిన ఫారెస్ట్ అధికారి జయరాంను వెంటబడి దాడి చేశారని ఫారెస్ట్ అధికారి తెలిపారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని దాడి చేసిన గిరిజనులను అదుపులోకి తీసుకొని ఫారెస్ట్ కార్యాలయానికి తరిలించారు.కొంతమంది పరారైనట్లు ఫారెస్ట్ రేంజర్ ఈశ్వర్ తెలిపారు.
అటవీ భూములను కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందని, అక్రమంగా అడవిని నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అధికారిపై దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. గిరిజన మహిళలు తమపై దాడి చేసారని ఆరోపించారు. అటవీ అధికారులపై దాడికి పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని నాగర్‌కర్నూల్ జిల్లా అటవీ అధికారుల సంఘం అధ్యక్షులు రవి కుమార్, ముజీబ్ ఘోరి, తేజశ్రీ, రాంబాబు, వల్య, హన్మంతు డిమాండ్ చేశారు.
-
Home
-
Menu
