అమెరికాలో చైనా అధ్యక్షుడు ల్యాండ్.. ఎయిర్ పోర్టుకు వెళ్లి స్యయంగా ట్రంప్ స్వాగతం

వాషింగ్టన్: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘన స్వాగతం పలికారు. మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం బుధవారం వాషింగ్టన్‌కు చేరుకున్న జిన్‌పింగ్, ఆయన సతీమణి పెంగ్ లియువాన్‌లకు.. స్వాగతం పలకడానికి ట్రంప్ స్వయంగా జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు వెళ్లారు. జిన్‌పింగ్ దంపతులు విమానం నుంచి దిగి వచ్చినప్పుడు... తన భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియాతో కలిసి ట్రంప్ వారికి సాదరంగా స్వాగతం పలికారు. ట్రంప్ ఇలా ఒక విదేశీ నాయకుడికి స్వయంగా స్వాగతం పలకడం చాలా అరుదు. ఈ పర్యటనకు ముందే వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. బుధవారం జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో ట్రంప్ స్వయంగా షీకి స్వాగతం పలుకుతారు.. ఆ తర్వాత గురువారం వైట్ హౌస్‌లో అధికారిక స్వాగత కార్యక్రమం జరుగుతుంది.
కాగా, సెప్టెంబర్ 25 వరకు జరిగే ఈ పర్యటనలో జిన్‌పింగ్.. వాణిజ్యం, కృత్రిమ మేధస్సు, కీలక ఖనిజాలు, తైవాన్, ఇతర సున్నితమైన అంశాలపై ట్రంప్‌తో ఉన్నత స్థాయి చర్చలు జరపనున్నారు.
-
Home
-
Menu
