కరీంనగర్ లో కవలల హత్య కేసు... నలుగురు నిందితులు అరెస్టు: సిపి

కరీంనగర్: కవలల హత్యకేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశామని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. ఆడపిల్లలు పుట్టారనే కారణంతోనే ఇద్దరు చిన్నారులను తండ్రి శ్రీశైలం హత్య చేశాడని పేర్కొన్నారు. చిన్నారి హత్యలో ముగ్గురు కుటుంబ సభ్యుల పాత్ర ఉందని వివరించారు. కవలలను బావిలోకి తోసేసి అనంతరం ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారన్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపామని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా శిక్షపడేలా చేస్తామని సిపి గౌస్ ఆలం వివరించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జూబ్లీనగర్‌లో కచ్చు శ్రీశైలం-మౌనిక అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కవల పిల్లలు ఉన్నారు. ఇద్దరు ఆడ పిల్లలు కావడంతో భర్తతో పాటు అత్తమామ, మరది మౌనికను పలుమార్లు వేధించారు. ఆడి పిల్లలు కన్నావని వేధించడంతో మౌనిక స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇద్దరు ఆడ పిల్లలను చంపాలని కన్నతండ్రి, నానమ్మ, తాతయ్య, బాబాయ్ నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు ఊరు వెళ్లగా శ్రీశైలం వారిని బావిలోకి తోసి హత్య చేసిన విషయం తెలిసిందే.
Tags
-
Home
-
Menu
