ఈస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో బిగ్ ట్విస్ట్

BRS Congress
X

సంగారెడ్డి జిల్లా ఈస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. బిఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, బిజెపి ఎంపి రఘునందన్ రావు ఒకే కారులో ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం కలిసి వచ్చారు. ఒకటో వార్డు కౌన్సిలర్ మమత బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ క్యాంప్ లో చేరారు. 8వ వార్డు కౌన్సిలర్ మాధవి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బిఆర్ఎస్ గూటికి చేరారు. ముగ్గురు కౌన్సిలర్లు స్వతంత్రులుగా గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఓ స్వతంత్ర కౌన్సిలర్ బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈస్నాపూర్ లో బిఆర్ఎస్ కౌన్సిలర్ల సంఖ్య 14కి చేరుకోగా కాంగ్రెస్ కు 12కు చేరుకున్నాయి. ఇద్దరు నేతలు మహిపాల్ రెడ్డి, రఘునందన్ రావు ఎక్స్ అఫిషియో ఓటు వేయడానికి ఒకే కారులో వచ్చారు. ఎక్స్ అఫిషియో ఓట్లతో ఇస్నాపూర్ పీఠం బిఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది.

Tags

Next Story