రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థుల మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థుల మృతి
X

హనుమకొండ...కరీంనగర్ ప్రధాన రహదారిలో హసన్ పర్తి పెద్ద చెరువు కట్ట మూల మలుపులోని పెట్రోల్ బంక్ సమీపాన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో బీటెక్ చదువుతున్న ఇద్దరు విద్యార్ధులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో త్రిబుల్ ఈ థర్డ్ ఇయర్ చదువుతున్న షేక్ జునాయిడ్ అక్రమ్( 21), ఆకుతోట సుప్రతిక (20)లు గా గుర్తించారు. శుక్రవారం కళాశాలలో పరీక్షలు రాసిన వీరిద్దరు అనంతరం మోటార్ వెహికల్ పై కళాశాల నుండి హనుమకొండకు బయలుదేరారు. దారిలో చెరువు కట్ట సమీపాన పెట్రోల్ బంకు సమీపంలో ఎలుకతుర్తి నుండి హనుమకొండ వైపు వేగంగా వస్తున్న లారీ వెనుక వైపు నుండి మోటార్ వెహికల్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం నెలకొంది.

దీంతో విద్యార్థుల శరీరాలు గుర్తుపట్టలేనంతగా నుజ్జునుజుగా మారాయి.దీంతో పరిస్థితి హృదయవిదారకంగా మారింది.ఈ సంఘటనలో మృతి చెందిన అక్రమ్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంగపేట మండలం రాజుపేట గ్రామం,మృతురాలు సుప్రతికది వరంగల్ పట్టణంలో ఎల్లమ్మ బజారుకూ చెందిన వారుగా స్థానికులు ద్వారా తెలిసింది.ఈ దుర్ఘ టనతో రెండు కుటుంబాలలో విషాదం నెలకొంది.ఈ రోడ్డు ప్రమాదంతో కిలోమీటర్ మేరకు వాహనాలు నిలిచిపోయాయి. సమాచార మేరకు హుటాహుటీన స్థానిక సీఐ వట్టే చేరాలు సిబ్బందితో ప్రమాద సంఘటన ప్రాంతానికి చేరుకొని మృతదేహాలను పోష్టుమార్టం నిమిత్తంఎంజిఎంకు తరలించారు. రహదారిలో నిలిచిపోయిన ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

Tags

Next Story