కొత్వాల్ చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

కొత్వాల్ చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి
X

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన రంగారెడ్డిజిల్లా మహేశ్వరం మండలం కెసి తాండలో చోటుచేసుకుంది. మహేశ్వరం సిఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం కెసి తాండకు చెందిన జాటావత్ రిషి (6), జాటావత్ బద్రీనాథ్ (8) ఆదివారం సెలవు కావడంతో గ్రామంలో ఆడుకునేందుకు ఇంటి నుండి వెళ్లారు. చీకటి పడినా ఇంటికి చేరకపోవడంతో కుటుంబీకులు మహేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి మహేశ్వరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆడుకుంటూ వెళ్లి గ్రామ సమీపంలోని కోత్వాల్ చెరువులో పడిపోయి ఉంటారన్న అనుమానంతో చెరువులో పోలీసు రెస్కూ టీం గాలింపు మొదలు పెట్టింది. ఆదివారం రాత్రి నుండి గాలింపు నిర్విహించి.. సోమవారం ఉదయం ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags

Next Story