ట్రాక్టర్ బైకును ఢీకొనడంతో ఇద్దరు బాలురు మృతి

X
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నాగార్జునసాగర్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును ట్రాక్టర్ ఢీకొనడంతో ఇద్దరు బాలురు మృతి చెందారు. తండ్రికి, మరో బాలుడుకి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. యాచారం మండలం తమ్మలోనిగూడ గేట్ వద్ద తండ్రి ముగ్గురు కుమారులతో కలిసి బైక్ పై వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు అభిరామ్(9), రాము (5) గా పోలీసులు గుర్తించారు.
Next Story
-
Home
-
Menu
