ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్యాయత్నం

ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్యాయత్నం
X

భార్య విడాకులు ఇవ్వడంతో మనస్తాపంతో ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను అత్యంత కర్కశంగా హతమార్చి తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నారాయణపేట జిల్లా, మరికల్ మండల పరిధిలోని తేలేరు గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల సమాచారం ప్రకారం..గ్రామానికి చెందిన శివ రాములుకు భార్య గతంలో విడాకులు ఇవ్వడంతో రిత్విక (8), చైతన్య (5) అనే ఇద్దరు పిల్లలతో ఉంటున్నాడు. భార్య లేకపోవడంతో తాము జీవించి ప్రయోజనం లేదని భావించి, తన పిల్లలకు క్రిమిసంహారక మందులు తాగించాడు. అయితే, పిల్లలు త్వరగా చనిపోకపోవడంతో కోయిల్ సాగర్ కాలువ వద్దకు వారిని తీసుకెళ్లి కర్కశంగా తొక్కి చంపేసి,

కాల్వలో పడేశాడు. అనంతరం తాను కూడా క్రిమిసంహారక మందు తాగినప్పటికీ ప్రాణాలు పోకపోవడంతో సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చివరకు చావలేక.. బతకలేని పరిస్థితులలో జరిగిన విషయాన్ని మంగళవారం తెల్లవారుజామున గ్రామస్థులకు తెలిపాడు. ఈ సమాచారాన్ని పోలీసులకు తెలుపగా అక్కడికి మరికల్ సిఐ రాజేందర్, ఎస్‌ఐ రాములు పోలీసులతో కలిసి పిల్లలను పడేసిన కోయిల్‌సాగర్ కాలువ వద్దకు చేరుకున్నారు. అనంతరం పిల్లలను బయటకు తీయగా వారు అప్పటికే మృతి చెందారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్న శివ రాములు చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ పేర్కొన్నారు.

Tags

Next Story