చిరుతల దాడిలో రెండు ఆవులు మృతి

X
Leopard attack on Motorist
మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలంపెద్ద వార్వాల్ గ్రామంలో చిరుతల దాడిలో రెండు ఆవులు మృతి చెందాయి. గ్రామానికి చెందిన శివ్వని బాలయ్య సోమవారం సాయంత్రం తన పశువులను పొలం వద్ద కట్టేసి ఇంటికి వచ్చాడు. రాత్రి 8.30 గంటలకు పశువులు పెద్దగా అరుస్తుండడంతో సాలార్‌నగర్ గ్రామస్థులు విషయాన్ని బాలయ్యకు చెప్పారు. అతడితో పాటు పలువురు రైతులు పొలం వద్దకు వెళ్లారు. అప్పటికే రెండు ఆవులు మృతి చెందాయి. వాటి విలువ రూ.65 వేలు ఉంటుందని బాధితుడు తెలిపాడు.
Next Story
-
Home
-
Menu
