మంచిర్యాలలో కరెంట్ వైర్లు తగిలి ఇద్దరు మృతి

మంచిర్యాలలో కరెంట్ వైర్లు తగిలి ఇద్దరు మృతి
X


మంచిర్యాల: ఇనుప స్టాండ్ తీసుకెళ్తుండగా విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... కాజీపేట గ్రామానికి చెందిన నాగరాజు, మ్యాదరిపేట గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణతో కలిసి ఎత్తైన ఇనుప స్టాండ్‌ను తీసుకెళ్తున్నాడు. ఆ స్టాండ్‌కు ఇనుప తీగలు తగలడంతో కరెంట్ షాక్‌తో ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story