పింఛన్ తొలగింపు.. ఇద్దరు దివ్యాంగుల ఆత్మహత్యాయత్నం

X
ప్రభుత్వం ప్రతి నెల అందిస్తున్న వికలాంగుల పెన్షన్ అర్ధాంతరంగా నిలిచిపోవడంతో మనస్థాపం చెందిన ఇద్దరు దివ్యాంగులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ముత్తారం ఎంపీడీవో కార్యాలయంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం రామకృష్ణపూర్(ఇప్పలపల్లి) గ్రామానికి చెందిన సూరం రాజబాపు,పెద్దపల్లి సత్తయ్యలకు వికలాంగుల పింఛన్ నిలిపివేశారు. బాధితులు మనస్తాపంతో బుధవారం ఎంపీడీఓ కార్యాలయంపైకి ఎక్కి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే స్పందించిన ప్రజలు కార్యాలయ భవనం పైకి ఎక్కి బాధితుల నుంచి పురుగు మందు డబ్బా లాక్కొని కిందికి తీసుకు వచ్చారు. ఈ ఘటనతో కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పింఛన్‌ను పునరుద్ధరించి న్యాయం చేయాలని బాధితులు కోరారు.
Next Story
-
Home
-
Menu
