పిడుగుపాటుకు సెల్‌ఫోన్లు పేలి ఇద్దరు రైతులకు తీవ్ర గాయాలు

పిడుగుపాటుకు సెల్‌ఫోన్లు పేలి ఇద్దరు రైతులకు తీవ్ర గాయాలు
X

గాంధారి: పిడుగుపాటుకు సెల్‌ఫోన్లు పేలి ఇద్దరు రైతులు తీవ్ర గాయాలపాలైన ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని జొప్పాజీవాడ శివారులో చోటు చేసుకుంది. బొప్పాజివాడకు చెందిన మేకల సూర్యకాంత్, బూర్గుల్‌కు చెందిన గైని శంకర్‌లు బొప్పాజివాడ శివారులోని పత్తి చేసులో గుంటుక కొడుతున్నారు. వర్షం రావడంతో ఇద్దరూ గొడుగు పట్టుకుని నిలుచున్నారు. ఈ క్రమంలో పిడుగు పడటంతో వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో ఇద్దరు రైతులు స్పృహ తప్పి పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారిని ఎడ్ల బండిపై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామీణ రహదారి వరకు అక్కడి నుంచి అంబులెన్స్‌లో గాంధారి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags

Next Story