కుంటలో పడి ఇద్దరు బాలికలు మృతి

X
ప్రమాదవశాత్తు కుంటలో పడి ఇద్దరు బాలికలు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా ములుగు మండలం కాసిందేవిపేట గ్రామానికి చెందిన ఎండీ అంజద్‌కు ఇద్దరు కుమార్తెలు. ఆదివారం సెలవు కావడంతో వారిని పొలం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ రహీం కుంటను చూడడానికి వెళ్లారు.అనుకోకుండా చిన్న కూతురు ఎండీ ఆసియా(10) కుంటలో పడింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో పెద్ద కూతురు ఎండీ సమ్యున్ (18) కుంటలో మునిగి మృతి చెందింది. పోలీసులు మృతదేహాలను శవ పంచనామా నిమిత్తం ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు. మంత్రి సీతక్క ఫోన్ చేసి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
Tags
Next Story
-
Home
-
Menu
