చెట్టును ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి

చెట్టును ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి
X

హైదరాబాద్: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో కారు బలంగా చెట్టును ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మృతులు హనుమకొండ జిల్లాకు చెందిన పార్శ సంపత్, బొంపల్లి కిషన్ గా పోలీసులు గుర్తించారు.

Tags

Next Story