బైక్‌ను ఢీకొట్టిన లారీ: ఇద్దరి మృతి

వేగంగా దూసుకు వచ్చిన లారీ కిందపడి ఇద్దరు వ్యక్తులు దూర్మరణం. సూరారం పోలీస్ స్టేషన్ పరిధి జ్యోతి మిల్క్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని వెనుక వైపు నుండి వేగంగా లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల దర్యాప్తు లో తెలింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం పాండు బస్తీ కి చెందిన రాపిడో డ్రైవర్ సురేందర్ రెడ్డి (45). సూరారం వెంకటరమణ కాలనీ కి చెందిన జ్యోతి (32) పల్సర్ బైక్ పైన నర్సాపూర్ రోడ్డులో వెళ్తున్నారు. బైక్ పై వెళ్తున్న వారిని వెనుక నుండి వచ్చిన లారీ అతివేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సురేందర్ రెడ్డి, జ్యోతి కింద పడిపోయారు. లారీ ముందు టైర్లు జ్యోతి, సురేందర్ పై నుండి వెళ్ళగా అక్కడికక్కడే చనిపోయారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. లారీని ట్రేస్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సూరారం సీఐ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు.
-
Home
-
Menu
