ముక్త్యాల కాలువలో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం గ్రామంలోని ముక్యాల కాలువలో ఈతకు వెళ్లిన 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండో శనివారం పాఠశాలకు సెలవు కావడంతో ముకుందపురం గ్రామంలో తోటి విద్యార్థి అనుదీప్‌ను కలువడానికి కోదాడ పట్టణానికి చెందిన హరీష్ నాయుడు, గుడిబండ గ్రామానికి చెందిన లేక స్వరూప్ లు వచ్చారు. ముగ్గురు కలిసి ముక్త్యాల కాలువ వద్దకు ఈత కోసం వెళ్లారు.
కాలువలోకి దిగిన ముగ్గురు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. అటుగా వెళ్తున్న స్థానికుడు అనుదీప్ ను కాపాడాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీస్, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని కాలువలో గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
-
Home
-
Menu
