రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీచర్లు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీచర్లు మృతి
X

మితిమీరిన వేగంతో వచ్చిన టిప్పర్ స్కూటీని ఢీకొనడంతో ఇద్దరు ఉపాధ్యాయురాళ్లు మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం జిల్లా కేంద్రంలో బీబీగుడెం నుంచి మార్కెట్‌కు వెళ్లే దారిలో జరిగింది. స్థానికులు, పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వేంల మండల కేంద్రంలోని మినీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రజిత రెడ్డి (45), మరో ఉపాధ్యాయురాలు గుగులోతు రక్మా (40) రోజు మాదిరిగానే పాఠశాల నుంచి తమ ద్విచక్ర వాహనంపై సూర్యాపేటకు బయల్దేరారు. మార్గమధ్యంలోని మూసీ కాలువ వద్దకు రాగానే, చివ్వేంల నుంచి సూర్యాపేట వైపు వచ్చిన టిప్పర్ వీరు ప్రయాణిస్తున్న స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రోజూ తమకు పాఠాలు బోధించే టీచర్లు ప్రమాదంలో మృతి చెందటంతో విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు.

Tags

Next Story