గోడ కూలి ఇద్దరు కూలీలు మృతి

గోడ కూలి ఇద్దరు కూలీలు మృతి
X

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. పాత బస్టాండ్ సమీపంలోని మొండి గేరిలో పాత భవనంకు మరమ్మత్తుల పనులు చేస్తుండగా ఒక్క సారిగా గోడ కూలింది.ఈ సంఘటనలో ఇద్దరు భవన నిర్మాణ కూలీలు దుర్మణం చెందారు. మరి కొందరు గాయపడ్డారు. శిథిలాల కింద మరి కొందరు చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎస్‌పి జానకి సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ సిబ్బంది వెంటనే చేరుకొని శిథిలాలను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా శిథిలాల కింద ఎంత మంది ఉన్నారన్నది తెలియడం లేదు. పాత భవనం ఓనర్ లక్ష్మణ్ గురువారం తన పాత భవనానికి మరమ్మతులు చేసే క్రమంలో నల్గురు భవన నిర్మాణ కార్మికులను పని అప్పగించారు. భవనానికి పైన డ్రిల్లింగ్ చేపట్టడంతోపాటు పక్కన ఉన్న రాగి చెట్టును కూడా తొలగించే క్రమంలో ఒక్క సారిగా గోడ కూలింది.

ఈ ఘటనలో గోడ కింద ఉన్న వారిపై గోడ కూలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా మరో ఇద్దరు శిథిలాల కింద ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. మరమ్మతులు చేసే క్రమంలో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వలనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఈ సంఘటన చాలా దురదృష్టకరమని అన్నారు. ఇంటి ఓనర్ సేఫ్టీ పికాషన్స్ తీసుకోకపోవడం వలనే ఈ ఘటన జరిగిందన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.అటెండర్ చెబుతున్న సమాచారం ప్రకారం అయితే ఇద్దరు చనిపోయారని, ఇంకా ఇద్దరు శిథిలాల కిందనే ఉన్నట్లు చెబుతున్నారన్నారు. సహాయక చర్యలు చేపడుతున్నామని,అధికారులు సిబ్బంది అందరూ ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు తెలిపారు. కలెక్టర్ విజయేంద్రీ బోయి మాట్లాడుతూ మృతుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని చెప్పారు. సంఘటనా స్థలంలో మున్సిపల్ కమిషనర్ కూడా పాల్గొన్నారు.

Tags

Next Story