నీటి సంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి

నీటి సంపులో పడి రెండేళ్ల చిన్నారి మృతి
X

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని రామన్నపేట గ్రామంలో శనివారం సాయంత్రం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తిప్పని జలంధర్ - శిరీష దంపతుల కుమార్తె విశ్రీవక (2) ఇంటి ముందు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందింది. తల్లిదండ్రులు వ్యవసాయ పనుల నుంచి తిరిగి వచ్చాక, తల్లి ఇంటి పనుల్లో నిమగ్నమైన సమయంలో చిన్నారి ఆడుకుంటూ వెళ్లి సంపులో పడిపోయింది. గమనించిన తండ్రి వెంటనే చిన్నారిని బయటకు తీసినప్పటికీ ఫలితం లేకపోయింది. కళ్ల ముందే రెండేళ్ల కూతురు అనంత లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు..

Tags

Next Story