రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా ఒకరికి గాయాలైన సంఘటన షాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ కాంతారెడ్డి తెలిపిన వివరాల మేరకు .షాబాద్ మండల పరిధిలోని హైతాబాద్ గ్రామానికి చెందిన దాసరి అజయ్ (19), ఉదయ్‌కిరణ్(19) అజాన్(19) ముగ్గురు కలిసి ఆదివారం సాయంత్రం చేవెళ్ల కు వెళ్లి అర్థరాత్రి తిరిగి ఇంటికి వస్తుండగా నాగర్‌గూడ చౌరస్తా వద్ద లారీ కంటైనర్ ఢీ కొనడంతో అజయ్, ఉదయ్ కిరణ్ అక్కడిక్కడే మృతి చెందారు. అజాన్‌కు కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు చూసి వారి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాగా అక్కడ నుండి మెరుగైన చికిత్స కోసం అజాన్‌ను నగరంలోని ఫ్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఉదయ్ కిరణ్ తండ్రి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-
Home
-
Menu
