ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి

X
సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు యువకులు శుక్రవారం ఉదయం మానేరు నదిలో ఈతకు వెళ్లి నీటిలో మునిగి మృతిచెందారు. సిరిసిల్ల శాంతినగర్‌కు చెందిన ఎదురుగట్ల హరిచరణ్ (18), చీర్లవంచ ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన అల్లం మణికంఠ (17) మానేరు నదిలో ఈతకోసం వెళ్లి ప్రమాద వశాత్తు నీటమునిగి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మృతదేహాలను బయటకు తీసి శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుల కుటుంబీకుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి.
Next Story
-
Home
-
Menu
