ఉక్రెయిన్ బస్సుపై రష్యా దాడి: 15 మంది మృతి

X
రష్యా ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది, ఒక వైపు ముగిసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా మరో వైపు ఉక్రెయిన్ పై రష్యా డ్రోన్లతో దాడులకు తెగపడింది. నిప్రో నగరంలో బస్సుపై డ్రోన్ తో దాడి చేయడంతో 15 మంది దుర్మరణం చెందారు. మరో ఏడుగురు గాయపడినట్టు సమాచారం. ఉక్రెయిన్ లోని అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తికి సంస్థకు చెందిన బస్సు అని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. నిప్రో పెట్రోవ్క్స్ ప్రాంతంలోని విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన డిటిఇకె గనులపై రష్యాదాడి చేసిందని ఉక్రెయిన్ అధికారులు ఆరోపణలు చేశారు. షిఫ్ట్ ముగిసిన అనంతరం కార్మికులు బస్సులో వెళ్తుండగా ఈ దాడి చోటుచేసుకుంది. కనిష్ట ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉక్రెయిన్ పై దాడులను తాత్కాలికంగా ఆపేందుకు రష్యా అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపిన రోజుల వ్యవధిలో దాడి జరగడం గమనార్హం.
Next Story
-
Home
-
Menu
