ఆత్మనిర్భర్‌ భారత్‌కు రూ.2 వేల కోట్లు: నిర్మలా సీతారామన్

ఆత్మనిర్భర్‌ భారత్‌కు రూ.2 వేల కోట్లు: నిర్మలా సీతారామన్
X

ఢిల్లీ: వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నామని, గ్లోబల్ మార్కెట్లతో పోటీ పడుతూ ముందుకు సాగుతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్ సభలో కేంద్ర బడ్జెట్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. లోక్ సభలో 2026-27బడ్జెట్ గురించి నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. ప్రభుత్వానికి బాసటగా నిలుస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. మూడు కర్తవ్యాలను లక్ష్యాలుగా ప్రకటించారు. ప్రజల ఆశయాలను అందుకోవడమే తమ లక్ష్యమని, ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలతో ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నామని తెలియజేశారు. ఈ బడ్జెట్ ను యువశక్తి బడ్జెట్ గా అభివర్ణించారు. నిర్మాణాత్మక సంస్కరణలతో ఈ కార్యవ్యాలను సాధిస్తామని, ఇది యూనిక్ బడ్జెట్ అని పేర్కొన్నారు. ఆత్మ నిర్భరత వల్లే 7 శాతం గ్రోత్ ఉంటుందని అన్నారు. కర్తవ్యం1: సమ్మిళిత ఆర్థిక వృద్ధి. కర్తవ్యం 2: ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం 3: సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అని తెలిపారు.

బయో ఫార్మా రంగానికి రూ.10 వేల కోట్లు, ఎపి, ఒడిశా, తమిళనాడు, కేరళలో గనుల కారిడార్, మూడు డెడికేటెడ్ కెమికల్ పార్క్‌ల నిర్మాణం చేపడుతామని, ప్రస్తుతమున్న ఎన్ఐపిఇఆర్ఎస్ ఆధునీకరించడంతో పాటు దేశంలో రెండు హైటెక్ టెక్నాలజీ రూమ్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. కంటైనర్ నిర్మాణ రంగానికి రూ.10 వేల కోట్లు, దేశంలో కొత్తగా మూడు కెమికల్ రీసెర్చ్ పార్కులు, సెమీకండక్టర్ మిషన్ కోసం రూ.40 వేల కోట్లు, జౌళి రంగానికి కేంద్ర బడ్జెట్‌లో చేయూతనివ్వడంతో పాటు మెగా టెక్స్‌టైల్ పార్క్‌ నిర్మాణం చేపడుతామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

సెమీ కండక్టర్ మిషన్ 2.O ప్రారంభిస్తామని, త్వరలో నేషనల్ ఫైబర్ స్కీమ్ ప్రారంభం, టెక్స్‌టైల్‌ రంగం అభివృద్ధికి కొత్త పథకం, దేశంలో కొత్త మెగా టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటు చేయడంతో పాటు ఖాదీ, హ్యాండ్లూమ్‌, హస్తకళల ప్రోత్సాహానికి పథకం ఏర్పాటు చేస్తామని, అత్యంత నాణ్యత కలిగిన క్రీడా వస్తువుల తయారీకి పథకం ఉంటుందని, 200 పారిశ్రామిక క్లస్టర్స్‌ ఆధునీకరణకు చేయూతనిస్తామన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌కు రూ.2 వేల కోట్లు కేటాయించడంతో పాటు ఎస్ఎంఇ రంగానికి రూ.10 వేల కోట్లు ఇస్తామని, మైక్రో సెక్టార్‌కు రూ.2 వేల కోట్లు ఇస్తామని, ఆత్మనిర్భర్‌ భారత్‌కు రూ.2 వేల కోట్లు ఇస్తామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.


నగరాలే దేశ గ్రోత్ ఇంజిన్లు అని, రెండో, మూడో స్థాయి నగరాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, పాట్నా, వారణాసిల్లో షిప్‌ రిపేర్‌ ఎకోసిస్టమ్‌, ఏడు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్ల అభివృద్ధితో పాటు ముంబై- పుణే, పుణే-హైదరాబాద్‌, హైదరాబాద్‌- చెన్నై రూట్లలో హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లు నిర్మించడంతో పాటు ఢిల్లీ- వారణాసి, వారణాసి- సిలిగురి మార్గాల్లో హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

Tags

Next Story