అకాల వర్షం.. అన్నదాతలు ఆగమాగం

అకాల వర్షం.. అన్నదాతలు ఆగమాగం
X

రెండు రోజులుగా వేసవి ఎండ రుచి చూసిన ప్రజలు సోమవారం ఒక్క సారిగా మారినఅకాల వర్షం.. అన్నదాతలు ఆగమాగమయ్యారు. సోమవారం మద్యాహ్నాం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చేసుకొని భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలలతో భారీ వర్షం కురవడంతో జిల్లా తడిచి ముద్దయ్యింది. కురిసిన అకాల వర్షంతో మామిడి చెట్లకు ఉన్న పూత రాలి పోయింది. అలాగే మండలంలో తెల్లబంగారం పండించిన రైతులకు ఇంకా కొందరు పత్తిని చెట్టు మీద నుండి తెంపక పోవడంతో సోమవారం కురిసిన అకాల వర్షానికి తడిచిపోయి రైతులకు నష్టాన్ని చవి చూపించింది.

గంట పాటు ఈదురు గాలులు వీస్తు వర్షకాలాన్ని తలపించే విధంగా ఉరుములు, మెరుపులతో భారీగా వర్షం కురవడంతో ప్రయాణికులు, ప్రజలు తడిచి ముద్దయ్యారు. నీడలో నిలబడిన అన్ని ప్రక్కల నుండి వర్షం కురవడంతో ఒక్కసారిగా వర్షకాలం వాతావరణం ను తలిపించింది. ఈ అకాల వర్షం వల్ల కొందరు పత్తి పంట నష్టపోయో అవకాశాలు ఉన్నాయని, అలాగే మామిడి కాయల కాతకు కూడా ఇబ్బందులు తప్పవని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కోన్నారు. రెండు గంటల అనంతరం ఒక్క సారిగా వాతావరణంలో మళ్లీ మార్పులు చోటు చేసుకొని వేసవి వాతావరణాన్ని తలపింప చేయడం విశేషం.

Tags

Next Story