ఉప్పల్ భగాయత్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి!

మన తెలంగాణ – ఉప్పల్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఉప్పల్ భగాయత్ హెచ్‌ఎండీఏ లేఅవుట్ పరిధిలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌పై ఉన్న విద్యుత్ స్తంభం దిమ్మెను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. రాత్రి 12 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం ప్రకారం.. సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న మహ్మద్ మునాజిర్ (34) తన యమహా ఎఫ్‌జెడ్ బైక్‌పై ఉప్పల్ భగాయత్ హెచ్‌ఎండీఏ లేఅవుట్ నుంచి నాగోల్ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో శ్రీపూజ గ్లాస్ హార్డ్‌వేర్ దుకాణం ఎదురుగా బైక్ అదుపుతప్పి డివైడర్‌పై ఉన్న విద్యుత్ స్తంభం దిమ్మెను బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు ఘటనా స్థలంలోనే చనిపోయారు. వెనుక కూర్చున్న వ్యక్తి మహ్మద్ సలావుద్దీన్ గా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడు సలావుద్దీన్ గుజరాత్ రాష్ట్రంలోని భరూచ్‌కు చెందిన కార్మికుడిగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉప్పల్ భగాయత్‌లోని జైన్ భవన్‌లో నివాసముంటున్నాడు.
Tags
-
Home
-
Menu
