ఉప్పల్ లో నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ ట్రక్కు

ఉప్పల్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఉప్పల్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ఉప్పల్ నుంచి తార్నకకు వెళ్తుండగా క్రికెట్ స్టేడియానికి సమీపంలో భారీ ట్రక్కు బోల్తాపడింది. రోడ్డు డివైడర్ కు ఢీకొట్టి నడి రోడ్డుకు అడ్డంగా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు క్లీనర్ కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఉప్పల్ రింగ్ రోడ్డు వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. డ్రైవర్ నిద్రమత్తులోనికి జారుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. క్రేన్ సహాయంతో ట్రక్కును తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Next Story