నల్లగొండలో అక్రమంగా తరలిస్తున్న యూరియా పట్టివేత

నల్లగొండలో అక్రమంగా తరలిస్తున్న యూరియా పట్టివేత
X

హైదరాబాద్: నల్గొండ జిల్లాలో యూరియాను అక్రమంగా తరలిస్తున్నారు. శుక్రవారం అర్థరాత్రి యూరియా లోడ్‌ను అక్రమంగా తరలిస్తూ ఫెర్టిలైజర్స్ షాపు యజమాని, స్థానిక రాజకీయ నాయకుడు పట్టుబడ్డాడు. నల్గొండ జిల్లా హాలియా మండల కేంద్రంలోని ప్రియాంక ఫెర్టిలైజర్స్ షాపుకు యూరియా లోడ్ వచ్చింది. అర్ధరాత్రి సమయంలో లారీ నుండి ఆటోలోకి యూరియాను అక్రమంగా తరలిస్తుండగా రైలు షాపు యజమానిని పట్టుకున్నారు. ఇటీవల ఇదే ప్రాంతంలో యూరియా లారీని పక్కదారి పట్టిస్తూ కొందరు రాజకీయ నాయకులు దొరికారు. మూడు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో యూరియా కోసం తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. అక్రమ తరలింపుపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖ అధికారులు కనీసం పట్టించుకోవడంలేదని వారు మండిపడుతున్నారు.

Tags

Next Story