భారత్‌తో మ్యాచ్: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న యుఎస్ఎ

ముంబై: ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో యుఎస్ఎ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టోర్నీ ఆరంభానికి ముందు ఇండియా-ఎ జట్టుతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో యుఎస్ఎ ఓటమిపాలైంది. దీంతో ఈ మ్యాచ్‌లో మరింత జాగ్రత్తగా ఆడిలని ఆ జట్టు భావిస్తోంది. మరోవైపు వరుస విజయాలతో పూర్తి ఫామ్‌లో ఉన్న భారత్.. ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నమెంట్‌ని విజయంతో ఆరంభించాలని అనుకుంటోంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు నుంచి వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, బుమ్రా దూరమయ్యారు. బుమ్రా స్థానంలో సిరాజ్‌ని జట్టులోకి తీసుకున్నారు. యుఎస్ఎ 6 బ్యాటర్లు, 2 ఆల్ రౌండర్లు, 3 బౌలర్లతో బరిలోకి దిగుతోంది.
తుది జట్లు:
భారత్: ఇషాన్ కిషన్(కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.
యుఎస్ఎ: ఆండ్రీస్ గౌస్(కీపర్), సాయితేజ ముక్కమల్ల, మోనాంక్ పటేల్(కెప్టెన్), మిలింద్ కుమార్, సంజయ్ కృష్ణమూర్తి, శుభమ్ రంజనే, హర్మీత్ సింగ్, మహ్మద్ మొహ్సిన్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, అలీ ఖాన్, సౌరభ్ నేత్రవల్కర్
-
Home
-
Menu
