ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేస్తోంది

Ustad Bhagat Singh movie
X

Ustad Bhagat Singh movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్టైనర్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.. ఓజి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత పవన్ నుంచి ఈ సినిమా వస్తుండగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ని ఈ నెలలోనే రిలీజ్ చేస్తున్నట్టు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై లేటెస్ట్‌గా పవన్ ఎనర్జిటిక్ పోస్టర్‌ని విడుదల చేసి ఈ సాంగ్ తాలూకా ప్రోమోని డిసెంబర్ 9న సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీనితో ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాలిడ్ డాన్స్ నెంబర్‌ని పవన్ నుంచి వారు ఆశిస్తున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటను సమ్ థింగ్ కంపోజ్ చేశాడట. ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వచ్చే ఏడాదిలో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు.

Tags

Next Story