స్కిప్పింగ్ జాతీయ ఛాంపియన్‌షిప్ లో రెండు స్వర్ణాలు... భవనం పైనుంచి పడి బాలిక మృతి

స్కిప్పింగ్ జాతీయ ఛాంపియన్‌షిప్ లో రెండు స్వర్ణాలు... భవనం పైనుంచి పడి బాలిక మృతి
X

12వ అంతస్తు నుంచి పడి విద్యార్థిని మృతి

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఘాజియాబాద్ లోని రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని ఓ అపార్ట్‌మెంట్ 12వ అంతస్తు నుంచి పడి 14 ఏళ్ల బాలిక మృతి చెందింది. శుక్రవారం రాత్రి ప్రాచి అనే బాలిక బట్టలు తీసుకునేందుకు బాల్కనీకి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. యశోద ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి, సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు.

ప్రాచి ఇటీవల మహారాష్ట్రలోని షిర్డీలో జరిగిన సిబిఎస్ఇ రోప్ స్కిప్పింగ్ జాతీయ ఛాంపియన్‌షిప్ లో రెండు స్వర్ణ పతకాలు సాధించింది. ‘డబుల్ డచ్ పెయిర్ ఫ్రీస్టైల్’, ‘డబుల్ డచ్ సింగిల్ ఫ్రీస్టైల్’ విభాగాల్లో బంగారు పతకాలు గెలుచుకుని కుటుంబ సభ్యుల్లో ఆనందం నింపింది. ప్రాచి తండ్రి సురేష్ చంద్ ఓ బహుళజాతి సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో తల్లిదండ్రులు, చెల్లెలు, తాతయ్య, నానమ్మ ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం.


Tags

Next Story