మంత్రి వాకిటి శ్రీహరికి తప్పిన ప్రమాదం.... వీడియో వైరల్

మంత్రి వాకిటి శ్రీహరికి తప్పిన ప్రమాదం.... వీడియో వైరల్
X

నారాయణ పేట: మంత్రి వాకిటి శ్రీహరికి పెను ప్రమాదం తప్పింది. నారాయణపేట జిల్లా మక్తల్ తహశీల్దార్ కార్యాలయంలో గణతంత్ర వేడుకల వేళ ప్రమాదం జరిగింది. జెండా ఆవిష్కరిస్తున్న సమయంలో ఒక్కసారిగా జెండా కర్ర విరిగిపడింది. అక్కడే ఉన్న మంత్రి వాకిటి శ్రీహరికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. జెండా కర్ర విరిగిపడటంతో ఒకరు గాయపడ్డారు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో సంఘటన స్థలంలో ఒక్కసారిగా కలకలం సృష్టించింది. భద్రతా లోపాలపై చర్చ జరగడంతో పాటు ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు.



Next Story