స్పెయిన్‌లో పెద్దపల్లి యువకుడు మృతి

X
పెద్దపల్లి: స్పెయిన్ దేశంలోని వేలెన్సియా నగరంలో భవనం పైనుంచి పడి తెలంగాణ యువకుడు మృతి చెందాడు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరామ్‌పూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన గీట్ల సుభాషినిరెడ్డి, గుణాకర్ రెడ్డి దంపతులు హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ఈ దంపతులకు సాయి అఖిల్ రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి అతడు స్పెయిన్ దేశానికి వెళ్లాడు. వేలెన్సియా నగరంలో నివసిస్తూ చదువుకుంటున్నాడు. సాయి అఖిల్ రెడ్డి భవనం పైనుంచి పడి మృతి చెందాడు. సాయి మృతితో కునారం గ్రామం ప్రజలు దు:ఖ సాగరంలో మునిగిపోయారు. కుమారుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీంటిపర్యంతమయ్యారు.
Tags
Next Story
-
Home
-
Menu
