వలిగొండలో ఆస్తి కోసం పెద్దమ్మను పొడిచి చంపిన కుమారుడు

ఖమ్మం: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాతర్ల గూడెం చెందిన పెద్దమ్మను ఆస్తి కోసం కత్తితో పొడిచి చంపాడు. ఈ సంఘటన ఖమ్మంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాతర్లగూడెంలో రాములమ్మకు 27 ఎకరాల భూమి ఉంది. భూమి విషయంలో పెద్దమ్మ రాములమ్మ, శేఖర్ అనే రౌడీషీటర్ కు మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. రాములమ్మ ఖమ్మంలోని బొక్కలగడ్డకు వెళ్లింది. శేఖర్ అక్కడికి వెళ్లి రాములమ్మను కత్తితో పొడిచి చంపాడు. వెంటనే స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి మీద వ్యామోహంతో హత్య చేసినట్టు తెలుస్తుంది. శేఖర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story
-
Home
-
Menu
