వలిగొండలో ప్రేమపెళ్లికి నిరాకరించిన ప్రియుడు.... యువతి ఆత్మహత్య

వలిగొండ: ప్రేమించాడు కానీ పెళ్లి చేసుకోనని చెప్పడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మొగలిపాక గ్రామానికి చెందిన మర్ల మత్స్యగిరి అనే యువకుడు మాయమాటలతో ఎం తుర్కపల్లికి చెందిన ముంత మమత (25) ను ప్రేమలోకి దించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో ప్రేమాయణం నడిపించాడు. ఇటీవల వివాహం చేసుకుందామని మత్యగిరిని మమత కోరడంతో అతడు పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. ఆదివారం తల్లిదండ్రులు పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లగా సోదరి పొలం పనులకు వెళ్లింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో మమత ఉరేసుకొని చనిపోయింది. సోదరి భవాని ఇంటికి వచ్చేసరికి ఫ్యాన్ వేలాడుతూ కనిపించడంతో కన్నీంటిపర్యంతమైంది. సూసైడ్ నోట్‌లో అమ్మనాన్న జాగ్రత్త అని రాసింది. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మత్స్యగిరిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
-
Home
-
Menu
