వందేమాతరం గీతాన్ని బిజెపి రాజకీయంగా వాడుకుంటుంది: కిరణ్ కుమార్ రెడ్డి

Vande Mataram song politically used by BJP
ఢిల్లీ: పార్లమెంట్ లో వందేమాతరం గీతంపై జరగబోయే చర్చను బిజెపి రాజకీయంగా వాడుకుంటుందని కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. చరిత్రను వక్రీకరించి, కాంగ్రెస్ నాయకులపై తప్పుడు ప్రచారం చేయడమే బిజెపి లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు. సోమవారం సోషల్ మీడియా ఖాతాలో చామల వీడియోను పోస్టు చేశారు. గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే జాతీయ స్థాయి వరకు అన్ని కాంగ్రెస్ సమావేశాలలో వందేమతరం పాడేవారని తెలియజేశారు. బిజెపి పార్టీకి సంబంధించిన ఆర్‌ఎస్‌ఎస్, సంఘ్ గానీ వాళ్ల ఆఫీస్‌లలో వందేమతరం ఎప్పుడు పాడలేదని చురకలంటించారు.
వందేమాతరం గొప్పతనం గురించి పార్లమెంటు చర్చ తీసుకరావడంతో పాటు దివంగత మాజీ ప్రధాని నెహ్రూ, గాంధీజీ గురించి చెడుగా ప్రచారం చేయాలని చూస్తోందన్నారు. వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా కాంగ్రెస్ నాయకులపై బిజెపి తప్పుడు చరిత్ర రాసి తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. పార్లమెంటులో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ, తాను కూడా నిజాలను ప్రజల ముందు ఉంచుతామన్నారు. శీతాకాలంలో 15 రోజులు మాత్రమే సమావేశాలు ఉంటాయని, దేశంలో ఇండిగో, ఢిల్లీ కాలుష్యం, నిరుద్యోగం వంటి సమస్యలు చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. బిజెపి రాజకీయం, ఎన్నికల గురించి మాట్లాడి కాంగ్రెస్‌ను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.
Tags
-
Home
-
Menu
