ఫ్యూచర్ సిటీలో జూపార్క్ ఏర్పాటు.. కుదిరిన ఒప్పందం

X
హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో కొత్త జూపార్క్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. జూపార్క్ ఏర్పాటుకు వంతారా ఎంవొయు కుదుర్చుకుంది. సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ మేరకు సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జూపార్క్ ఏర్పాటుకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. వన్యప్రాణులకు సేవ అనే నినాదంతో వంతారా పని చేస్తోందని కొనియాడారు. ఈ నెల చివర్లో గుజరాత్‌కు వెళ్లి వంతారాను సందర్శిస్తామని పేర్కొన్నారు. వంతారా సంస్థ ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీకి చెందినది అన్న విషయం తెలిసిందే.
Next Story
-
Home
-
Menu
