వార ఫలాలు (25-01-2026 నుండి 31-01-2026 వరకు)

Vara phalalu
మేష రాశి వారికి ఈవారం చాలా అనుకూలంగా ఉంది. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. వీరికి ఏలిన నాటి శని నడుస్తుంది శని అంతా అనుకూలంగా లేడు. వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి అవుతాయి. ధనవ్యయ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యో గాలలో చికాకులు మరింత పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అదేవిధంగా దైవదర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థినీ విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు చదవండి. ఏదైనా ఒక సోమవారం లేదా 8 సోమవారాలు శివాలయంలో రుద్రాభిషేకం జరిపించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. స్థిరాస్తులు పెరుగుతాయి. ఒకచోట స్థలాన్ని అమ్మి మరొకచోట స్థలం కొనుగోలు చేస్తారు. విహారయాత్రలు దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. మీరు ఏదైనా మాట్లాడితే దానిని వక్రీకరించే వారు ఎక్కువగా ఉంటారు జాగ్రత్త వహించండి. _నూతన వస్తులాభాలు ఉంటాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటారు. ఇంటా బయట ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకుంటాయి. జీవిత భాగస్వామితో ఆచితూచి వ్యవహరించండి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గి అవకాశం ఉంటుంది జాగ్రత్త వహించండి ఎక్కువగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి._మేధా దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. సుబ్రహ్మణ్య పాశుపత కంకణం చేతికి ధరించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మిధున రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. క్రెడిట్ కార్డులకు పర్సనల్ లోన్లకి దూరంగా ఉండండి. విద్యార్థులు అంచనాలు అందుకుంటారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితులు, సహాయ సహకారాలు అందుతాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. నూతన వాహనయోగం ఉన్నది. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. మేధా దక్షిణామూర్తి రూపు మెడలో ధరించండి. విదేశీ వ్యవహారాలు సానుకూల పడతాయి. ప్రతిరోజు ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి. ప్రతిరోజు కాలభైరవ అష్టకం చదవండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య అయిదు కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కర్కాటక రాశి వారికి వారం చాలావరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఉద్యోగ పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసికమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది చాలావరకు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. దూర ప్రాంతా ప్రయాణాలు అత్యవసరమైతేనే చేయండి. మధ్యవర్తి సంతకాలకు దూరంగా ఉండండి. నూతన అవకాశాలు చేతి వరకు వచ్చి చేజారి పోయే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసరకులమ్మేవారికి కూరగాయల వ్యాపారస్తులకు మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. గృహమున కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి అలాగే ప్రతిరోజు కాలభైరవ అష్టకం చదవండి మంచి ఫలితాలు కలుగుతాయి. ఏదైనా పని మీద బయటపడేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
సింహ రాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పర్సనల్ లోన్లకి క్రెడిట్ కార్డులకి స్టాక్ మార్కెట్ కి దూరంగా ఉండండి. ఎంత శ్రమపడిన పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. మానసిక సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన గృహం కొనుగోలు చేయాలని ఆలోచన కలుగుతుంది. విదేశాలలో ఉన్న వారికి కాస్త గడ్డుకాలంకా చెప్పవచ్చు. మధ్యవర్తి సంతకాలకు దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యా 3 కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కన్యా రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. కెరియర్ పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి మీ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. వివాహం కాని వారికి పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఈ వారం శుభవార్త వింటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపార వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు.
ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగమున మీ విలువ మరింత పెరుగుతుంది. ఆరోగ్యపరంగా చిన్నచిన్న సమస్యలు ఇబ్బంది పెడతాయి. విహారయాత్రలు దేవదర్శనాలు చేసుకుంటారు. విద్యార్థిని విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి సుందరాకాండ పారాయణ చేయండి లేదా వినండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద వెళ్లేటప్పుడు బుధవారం కాని శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
తులారాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. స్థిరాస్తులను పెంచుకుంటారు. కుటుంబ పరమైన చికాకులు పెరుగుతాయి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. మిత్రులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. ముఖ్యమైన విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలు ముడి పడతాయి. హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదవండి లేదా వినండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. బంధుమిత్రులతో కలిసి కాలం ఆనందంగా గడుపుతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు బాగున్నాయి. సంతానానికి మంచి ఉద్యోగం లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు ఎంతగానో మేలు చేస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు మిల్కీ వైట్. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
ధనుస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. విద్యార్థినీ విద్యార్థులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. నూతన ప్లాటు కొనుగోలు చేస్తారు. ఆదాయ వ్యయాలు సరి సమానంగా ఉంటాయి. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగిపోతాయి. నలుగురిలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశ్శివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
మకర రాశి వారికి వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలపరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. దైవచింతన పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. దానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతి కలుగుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి. అలాగే హనుమాన్ చాలీసా చదవండి లేదా వినండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసివచ్చే రంగు మెరూన్. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. సహోదరీ సహోదరుల మధ్య ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా స్కిన్ ఎలర్జీలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం చదవండి లేదా వినండి. దక్షిణామూర్తి రూపు మెడలో ధరించండి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. విలువైన వస్త్ర ఆభరణలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన అనుకూలత కలుగుతుంది. అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి._సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిపి వచ్చే రంగు గ్రీన్. నేను పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కాలేజీకి శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మీనరాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు. కోర్టు సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఎప్పుడో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ప్లాటు కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇప్పటినుండే పొదుపు ప్రయత్నాలు చేస్తారు. సంతానం విషయంలో క్రమశిక్షణ లోపిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు చాలావరకు తొలగిపోతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. అదేవిధంగా మొండి బాకీలు వసూలు అవుతాయి. వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. నూతన బ్రాంచీలను ఏర్పాటు చేస్తారు. ఈ రాశి వారికి ఏలిన నాటి శని ఉంది కావున 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. శని గ్రహం దగ్గర నువ్వుల నూనెతో నల్ల వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
Tags
-
Home
-
Menu
