వార ఫలాలు (22/11/2026 నుంచి 28/11/2026)

మేష రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా మద్యస్థ ఫలితాలు ఉంటాయి. ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెడితే అది మధ్యలో ఆగిపోయి అవకాశం ఉంది. ఏ పని మొదలుపెట్టిన నిదానంగా సాగుతుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఏదైనా లోన్ తీసుకొని అప్పు తీర్చాలని ఆలోచన చేస్తారు. వృత్తి ఉద్యోగాలపరంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ దైవానుగ్రహం వల్ల కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాలు వివాహ సంబంధమైన విషయాలు ఓ కొలిక్కి వస్తాయి. హోటల్ మేనేజ్మెంట్ టీచింగ్ ఫెయిల్ లో ఉన్నవారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. శని అంతా అనుకూలంగా లేడు. శనికి తైలాభిషేకం చేయించండి. అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణ చేయండి లేదా వినండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
వృషభ రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వపరంగా రావలసినటువంటి ధనం చేతికందితుంది. ఏదైనా ఒక్క నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. బంధు వర్గానికి సహాయ సహకారాలు అందిస్తారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా చదవండి. విద్యార్థిని విద్యార్థులకు చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మరింత పేరు ప్రఖ్యాతలు వచ్చే విధంగా గ్రహగతులు ఉన్నాయి. ఉద్యోగ పరంగా ఇంక్రిమెంట్ కానీ ప్రమోషన్ కానీ వచ్చే అవకాశం ఉంది. సేవింగ్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. రాశి వారికి నరదిష్టి అధికంగా ఉంటుంది. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కలవడం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మిథున రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. వృత్తి ఉద్యోగాలపరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. పై అధికారుల వల్ల ఇబ్బందులు ఉండే పరిస్థితి అవతరిస్తుంది. దైవానుగ్రహం వల్ల మీరు మొదలుపెట్టిన పని పూర్తవుతుంది. మీకు రావలసినటువంటి బెనిఫిట్స్ మరియు స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి వివాదాలు తొలగిపోతాయి. మీరు గతంలో కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. మీరు ప్రశాంతంగా ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. మీకు కలిసి వచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఉంటాయి. ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. నిరాశ వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్లకి కొంత ఆలస్యం అయినప్పటికీ మంచి సంబంధం కుదురుతుంది. వ్యాపార పరంగా మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వైద్య వృత్తిలో ఉన్న వారికి నిత్యవసర సరుకులు అమ్మే వారికి పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి హోటల్ వ్యాపారస్తులకు లాభాలు బాగుంటాయి. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
సింహ రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ ఉండవు. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మీకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకునే విధంగా కష్టపడతారు. ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా శివనామ స్మరణ చేయండి. శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం చేయించండి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ ఉండవు. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది కావున 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. సంతానానికి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహపరంగా విదేశీ ఆనం పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. శనివారం రోజున నలుపు వత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు కాషాయం. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కన్యా రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం అవుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. ఉద్యోగ, వ్యాపార పరంగా బాగుంటుంది అయినప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. భూ సంబంధమైన విషయాలు సానుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కాలం అనుకూలంగానే ఉంటుంది. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. దైవదర్శనం చేసుకుంటారు. కార్తీకదీపం వెలిగించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
తులారాశి వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వచ్చిన ఆదాయానికి తగినట్టుగా ఖర్చులు కూడా ఉంటాయి. సంతానం కోసం చేసేటువంటి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎంతోకాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారం శుభవార్త వింటారు. కార్తీకదీపం వెలిగించండి. నూతన గృహ నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం అంతంత మాత్రమే ఉంటుంది. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా స్థిరమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళండి భవిష్యత్తు బాగుంటుంది. ప్రతిరోజు కూడా జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యా 9 కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. వినపడ మీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. సంతాన సంబంధించిన విద్యా విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగపరంగా కలిసి వస్తుంది. ఎక్కువగా దైవదర్శనాలు చేసుకుంటారు. బంద్ వర్గంతో విభేదాలు రాకుండా చూసుకుంటారు. శుభకార్యాల నిమిత్తం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. రాజకీయరంగంలో ఉన్నవారికి మీరు ఊహించిన పదవి లభిస్తుంది. ఈ రాశి వారు ప్రతి రోజు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు ఎరుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
ధనుస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలపరంగా ఇబ్బందులు లేనటువంటి వాతావరణం ఉంటుంది. కిందిస్థాయి ఉద్యోగులు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారంలో నూతన ప్రాజెక్టులు చేతికి అందుతాయి. బంధు వర్గంతో సఖ్యత ఏర్పడుతుంది. రాజకీయరంగంలో ఉన్నవారికి నూతన పదవులు లభిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మనోబలంతో మనోధైర్యంతో ఏదైనా సాధించగలము అనే ధైర్యం ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. శనివారం రోజున నలుపు వత్తులతో దీపారాధన చేయండి. శనికి తైలాభిషేకం చేయించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు ప్రాప్తిస్తాయి.
మకర రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా అనుకూలత ఏర్పడుతుంది దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అంతంత మాత్రంగానే ఉంటుంది. హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. క్రెడిట్ కార్డులకే దూరంగా ఉండండి. ఆరోగ్యపరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎక్కువగా చదవండి. ఈ కార్తీకమాసంలో 365 వత్తులతో తులసి కోట దగ్గర దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కుంభ రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. సహోదరి సహోదరుల మధ్య ఆస్తి విభేదాలు ఉండే అవకాశం ఉంది. తెరథిరాస్తులకు సంబంధించిన విషయాలు నిదానంగా సాగుతాయి. అందరినీ నమ్మి అన్ని చెప్పడం మంచిది కాదు. ప్రతి విషయంలో కూడా గోప్యత పాటించండి. దైవదర్శనాలు చేసుకుంటారు. మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. విదేశాలలో ఉండి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఏలిన నాటి శని నడుస్తుంది కావున శనికి తైలాభిషేకం చేయించండి. పునర్ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ప్రతిరోజు ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మీన రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. మీరు కోరుకున్న మంచి సంబంధం కుదురుతుంది. గతవారం కంటే కూడా వ్యాపారస్తులకు ఈ వారం లాభాలు బాగుంటాయి. ఉద్యోగపరంగా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. సంఘ సేవలో పాల్గొంటారు. సినీ కళా రంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వైద్య రంగంలో ఉన్న వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. వచ్చినా అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. సోమవారం మరియు శుక్రవారం రోజున అమ్మవారికి కుంకుమార్చన చేయండి. ఈ కార్తీకమాసంలో చివరి సోమవారం రోజున 365 వత్తులు వెలిగించండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
Tags
-
Home
-
Menu
