క్షణికావేశంలో ఆత్మహత్య... ఇద్దరికి వెలుగునిచ్చిన వర్షితా

Varshitha donor eyes
మరణించి జీవిస్తున్న వర్షిత
ఇద్దరు అందులకు చూపినిచ్చిన జనహిత సేవా సమితి
మన తెలంగాణ / బెల్లంపల్లి టౌన్ : తాను మరణించినా ఇద్దరు అందులకు వెలుగునిచ్చిన వర్షిత కుటుంబాన్ని జనహిత సేవా సమితి అభినందించారు. బెల్లంపల్లి పట్టణం సుభాష్ నగర్ బస్తీకి చెందిన లింగంపెల్లి వర్షిత (12) ఆత్మహత్య చేసుకుంది. మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి రమేష్‌లు వారి కుటుంబ సభ్యులను కలిసి వర్షిత నేత్రాలను నేత్రదానం చేయడానికి సభ్యులను ఒప్పించారు. కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో ఉండి ఇద్దరు అంధులకు జీవితంలో వెలుగులు నింపిన వర్షిత కుటుంబాన్ని పలువురు నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా జనహిత సేవా సమితి అధ్యక్షులు ఆడెపు సతీష్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వాతి రమేష్‌లు మాట్లాడుతూ... సమాజహితం కోరి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు వారి కూతురు నేత్రాలను దారం చేయడం సంతోషకరమన్నారు. జనహిత సేవా సమితి తరుపున ఇప్పటి వరకు 12 నేత్ర దానాల కార్యక్రమాలు నిర్వహించారు. వారి కుటుంబ స్ఫూర్తితో ప్రజలందరు మరణించిన తర్వాత అవయవాలను దానం చేసి సమాజానిక ఉపయోగపడాలనే ఉద్దేశంతో ప్రతీ ఒక్కరు ముందుకు రావాలని వారు కోరారు.
సదాశయ ఫౌండేషన్ వారి సహకారంతో ఎల్‌వి ప్రసాద్ ఐ బ్యాంకు సిబ్బంది నేత్రాలను స్వీకరించి వారి కుటుంబాన్ని అభినందించారు. జనహిత సేవా సమితి ఆద్వర్యంలో 8 మంది ప్రాణాలను కాపాడే అవకాశం, రక్తదానంతో ఎంతో స్పూర్తిదాయకంగా వైద్యశాలకు వారి మృతదేహాన్ని అందిస్తే వైద్య విద్యార్ధులకు బోధనకు ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. ప్రజలందరు అపోహలు వీడి నేత్ర, అవయవ, శరీర దానాలకు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితి సభ్యులు అంధుల రాజన్న, ఎల్ వి ప్రసాద్ బ్యాంకు సిబ్బంది, జనహిత సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. వర్షిత తన స్నేహితురాలుకు ఆర్థిక సాయం చేసింది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేదు కానీ డబ్బులు ఎలా ఇస్తావని తండ్రి ఆమెను ప్రశ్నించడంతో వర్షిత ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
Tags
-
Home
-
Menu
